Latest

Loading...

PMMSY : వారికి ప్రత్యేక పథకం.. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోండి..!

Modi

 కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నదాతలని ఆదుకోవడానికి కూడా వివిధ రకాల స్కీమ్స్ ని కేంద్రం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.


ఇది ఇలా ఉంటే మత్స్యకారులకు చేపల పెంపకం అనేది జీవనోపాధి. అయితే చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్రం PMMSY .


PMMSY

అందుకే వారి కోసం మత్స్య సంపద యోజనను ప్రారంభించింది. అయితే ఈ స్కీమ్ 2024-25 వరకు వర్తిస్తుంది. మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, మత్స్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా ఈ స్కీమ్ నుండి లబ్ధి పొందవచ్చు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 5 సంవత్సరాలు అమలు చేస్తారు.


ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వర్తిస్తుంది. సంవత్సరానికి 9 శాతం చొప్పున మత్స్య రంగం పెంపుతో 2024-25 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతుంది. ఇక ఈ పథకం వలన ఎవరు లాభాన్ని పొందుచు అనేది చూస్తే.. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం రూ.3 లక్షల రుణం ఇస్తుంది.


మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల విక్రయదారులు, మత్స్య అభివృద్ధి కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాలు, మత్స్య రంగం, మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార సంఘాలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ సంస్థలు, మత్స్య ఉత్పత్తిదారులు వినియోగించుకోచ్చు.


PMMSYలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు అధికారిక వెబ్‌సైట్ pmmsy.dof.gov.inకి వెళ్లాలి. దీని ద్వారా మీరు అప్లై చేసుకోచ్చు. ఆధార్ కార్డు, చేపల పెంపకం కార్డు, నివాస ధృవీకరణ పత్రం, సంప్రదింపు నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి.

1 comment:

  1. Roulette Casino Review 2021 ✔️ Best Bonus Offers
    Are 벳익스플로어 the Roulette Casino Mobile Apps Safe? ➤ 위닉스 사이트 Check ⭐ 딥 슬롯 Trusted 강원 랜드 슬롯 머신 reviews 벳 플릭스 ✔️ Exclusive promotions ✔️ Huge Jackpots ✔️ Double Your Bet!

    ReplyDelete

Powered by Blogger.