PRC : రండి చర్చిద్దాం.. ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం...!!
ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎస్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.
ఈ మేరకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించింది. కాసేపట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. పీఆర్సీపై అధికారుల కమిటీ నివేదిక సహా ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. సీఎస్ కమిటీ నివేదికలో పేర్కొన్న 14.29శాతం ఫిట్‌మెంట్, వచ్చే ఏడాది నగదు రూపంలో చెల్లింపు, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు తదితర అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపనుంది.
అయితే వీటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని.. తమ 71 డిమాండ్లనూ పరిష్కరించేందుకు ముందుకొస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కేవలం పీఆర్సీ అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం కోరడంలో సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంకానున్నారు.
No comments