Latest

Loading...

RBI: RBI కొత్త రూల్స్.....కస్టమర్లకు షాకింగ్ న్యూస్.....!

RBI

RBI: న్యూ ఇయర్ కేలండర్ తో పాటు RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త రూల్స్ కి ఆహ్వానం పలుకుతోంది. అదేనండి.. కొత్త ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.


వీటిని బ్యాంక్ ఖాతాదారులు అంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా కస్టమర్ షాపింగ్ చేసినప్పుడు లేదా పుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ప్రతిసారీ కార్డు వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో, స్వీగ్గీ వంటి ఈకామర్స్ సంస్థలలో షాపింగ్ చేసేటప్పుడు కొత్త రూల్స్ ప్రకారం, కస్టమర్ల కార్డు వివరాలను స్టోర్ చేసుకోకూడదు.


దీనికి ఆల్ట్రనేటివ్ పద్ధతులు ఎమన్నా ఉన్నాయా?


వున్నాయనే చెప్పుకోవాలి. ప్రతిసారీ కార్డు వివరాలు ఎంటర్ చేయాలంటే సదరు కస్టమర్లకు కొంచెం కష్టమైన విషయమే. అందుకని వారికి టోకెనైజేషన్ సర్వీసులు అందుబాటులో వున్నాయి. ఈ టోకెనైజేషన్ విధానంలో కార్డు వివరాల స్థానంలో ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. దీని ద్వారా ఎంతో ఈజీగా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. దీనికి కార్డు వివరాలతో పని ఉండదు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో RBI ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది.


క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగిన వారికోసం కొన్ని విషయాలు:


1. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఇలా రెండింటికీ ఈ రిజర్వు బ్యాంక్ రూల్స్ వర్తిస్తాయి.

2. ఈ నిబంధనలు కేవలం డొమెస్టిక్ కార్డుల వారికి మాత్రమే వర్తిస్తాయి.

3. ప్రస్తుతానికి మాస్టర్ కార్డు, వీసా కార్డులకు మాత్రమే ఈ టోకెనైజేషన్ ఫెసిలిటీ కలదు.

4. కార్డుల టోకెనైజేషన్‌కు ఎలాంటి అదనపు చార్జీలు వర్తించవు.

5. ఈ కార్డుల టోకెనైజేషన్ అనేది తప్పనిసరి మాత్రం కాదు. అవసరమైనపుడు మాత్రమే వినియోగించాలి.

No comments

Powered by Blogger.