Latest

Loading...

sesame seeds Joint Pains tips వారంలో 3 రోజులు పాలల్లో కలిపి తాగితే 100 ఏళ్ళు వచ్చిన కీళ్లనొప్పులు,మోకాళ్ళనొప్పులు,నిద్రలేమి,రక్తహీనత ఉండవు...!!

sesame seeds Joint Pains tips

 sesame seeds Joint Pains tips In telugu : మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,భుజం నొప్పి, నడుము నొప్పి అనేవి ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి.


అలాగే ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉండదు. నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో ఏమి చేయాలన్న చేయలేరు. దాంతో నిరాశకు కూడా గురి అవుతూ ఉంటారు.


మీ శరీరంలో కాల్షియం లోపం లేదా విటమిన్ డి లేదా రెండింటి లోపం ఉంటే ఈ సమస్యలు వస్తాయి. కాల్షియం లేకపోవడం ఎముక సాంద్రతను తగ్గిస్తుంది. మరియు విటమిన్ డి అనేది మీ శరీరంలో కాల్షియంను గ్రహిస్తుంది, కాబట్టి విటమిన్ డి మరియు కాల్షియం రెండూ ఎముక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.


ఇప్పుడు కీళ్లనొప్పులు నడుము నొప్పి తగ్గించుకోవటానికి రెండు రకాల హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. తెల్ల నువ్వులను వెగించి పొడి చేసుకోవాలి. అరస్పూన్ పొడి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగాలి. ఇక 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి.


ఈ విధంగా ప్రతి రోజు బాదం తింటూ, నువ్వుల పొడి కలిపిన పాలను తాగితే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్త హీనత, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజు నువ్వులు, బాదంను తీసుకోవాలి.


40 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు వారంలో 3 సార్లు నువ్వులు, బాదం తీసుకుంటే సరిపోతుంది. జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోకుండా ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

No comments

Powered by Blogger.