soaking seeds Health benefits ప్రతి రోజు పరగడుపున ఈ 4 తింటే జీవితంలో అసలు డాక్టర్ అవసరం ఉండదు....ఇది నిజం...!!
soaking seeds Health benefits : మనం తీసుకొనే ఆహారం అనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.
మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం లేదా యోగా చేస్తూ ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇప్పుడు 4 రకాల గింజలను నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అరస్పూన్ మెంతులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అరస్పూన్ ఆవిసే గింజలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అవీసే గింజలను తింటూ ఆ నీటిని తాగాలి. అధిక బరువు సమస్యను తగ్గించటమే కాకుండా డయబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
బాదంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పును నేరుగా తినటం కన్నా నానబెట్టి తింటే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచటమే కాకుండా రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించటానికి సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
రాత్రి సమయంలో అరస్పూన్ నువ్వులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గించటమే కాకుండా రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు చెప్పిన 4 రకాలను ప్రతి రోజు నానబెట్టి తింటే ఇప్పుడు చెప్పిన అన్నీ ప్రయోజనాలను పొందవచ్చు.
No comments