Latest

Loading...

stomach pain: కడుపు నొప్పి వస్తూ.. పోతూ ఉంటుందా? అయితే ఈ పద్దతితో నొప్పికి చెక్​ పెట్టండి..!!

stomach pain

 ఆధునిక యుగంలో కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారం (food)లోనూ ఇది మామూలైపోయింది.


అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి (Stomach pain) తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు(problems) వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి (stomach pain) కారణం అవ్వవచ్చు


చలికాలంలో కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం (Temperature down).. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు (Immunity power down).. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ (digestive system) పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను (health tips) అనుసరించండి.

జీర్ణవ్యవస్థ పై తీవ్ర ప్రభావం..

చలికాలంలో (In winter) ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరానికి వెచ్చదనం అందించేందుకు కేలరీలు ఎక్కువగా అవసరమవుతాయి. దీని వలన జీర్ణవ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. చలికాలంలో జీర్ణవ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో నొప్పి (Stomach pain) పడుతుంది. కడుపునొప్పి నివారణకు మెంతులు (Dill) మేలు చేస్తాయి. మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. కడుపులో గ్యాస్ సమస్య నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు నొప్పి తగ్గుతుంది.

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క (Cinnamon) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ (digestive) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తిన్న తర్వాత.. దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకోవాలి. కడుపు నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కడుపులో జలుబు తగ్గాలంటే జీలకర్ర, కొత్తిమీర, మెంతి, కారం, మెంతి కూరలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

No comments

Powered by Blogger.