Vaccine Certificate : 30 సెకన్లలో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకోండిలా...!!
కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం ఎంత ముఖ్యమో.. వ్యాక్సిన్ వేసున్నట్టు ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా..
ఏవైనా ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలన్నా.. ట్రెయిన్, విమాన ప్రయాణాల్లో కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. చివరకు బస్సుల్లో ప్రయాణించాలన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. అందుకే.. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లు ఖచ్చితంగా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాల్సిందే.
అయితే.. కొందరికి తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియదు. కోవిన్ అనే యాప్‌లో కానీ.. వెబ్‌సైట్‌కి వెళ్లి కానీ.. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ.. చాలామందికి వాటి మీద అవగాహన లేదు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిపికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కానీ.. అందరికీ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా సర్టిఫికెట్‌ను అందుబాటులో తీసుకురావడం కోసం.. కేంద్ర ప్రభుత్వం వాట్సప్‌లో కేవలం 30 సెకన్లలో సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది.
దాని కోసం వాట్సప్‌లో మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ పేరుతో చాట్‌బాట్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని కోసం 9013151515 అనే నెంబర్‌ను ముందు మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి.. ఆ ఫోన్ నెంబర్ వాట్సప్ చాట్‌ను ఓపెన్ చేసి.. సర్టిఫికెట్ అని మెసేజ్ పంపించండి. అయితే.. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న నెంబర్ నుంచే వాట్సప్ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయగానే.. చాట్ బాక్స్‌లో డౌన్‌లోడ్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది రెండో ఆప్షన్‌గా ఉంటుంది. దీంతో 2 నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత.. డౌన్‌లోడ్ కోవిన్ సర్టిఫికెట్ ఆని మూడో ఆప్షన్ కనిపిస్తుంది. మళ్లీ 3 అని రిప్లయి ఇస్తే.. అప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
sridevi.anu2012@gmail.com
ReplyDelete