Latest

Loading...

Village Secretariats: ఆ ఉద్యోగులకు యూనిఫామ్, సిమ్ కార్డులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు...!!.

Village Secretariats

 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.


రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం లక్షా 20వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించిన ప్రభుత్వం ప్రస్తుతం వారికి సంబంధించి ప్రొబేషన్ ఖరారు చేసే పనిలో ఉంది. త్వరలోనే వారంతా పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రమోషన్ పొందబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫామ్ తో పాటు 4జీ సిమ్ లు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తర్వాత సీఎం జగన్ యూనిఫామ్ కలర్ ను ఖరారు చేశారు. ఇప్పటికే 13 జిల్లాలను రెండుగా విభజించి రెండు సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా యూనిఫామ్ పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరికి మూడు జతల చొప్పున యూనిఫామ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు ప్యాంట్స్, షర్ట్స్, మహిళలకు పంజాబీ డ్రెస్ లకు సంబంధించిన వస్త్రాలను అందజేయనున్నారు.

అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సబంధించి కర్ణాటకకు చెందిన గుడ్ విల్ ఫ్యాబ్రిక్స్, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప జిల్లాలకు మహారాష్ట్రకు చెందిన మాలిప్ చంద్ పదమ్ చంద్ సంస్థలు వస్త్రాలను సరఫరా చేయనున్నారు.

: సంక్షేమంతో పాటే అభివృద్ధి పరుగులు.., కడప టూర్ లో సీఎం జగన్..


ఇక ఉద్యోగులకు 4జీ సిమ్ లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు ప్రముఖ టెలికమ్ సంస్థలకు సిమ్ లు సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం పర్చేజ్ ఆర్డర్స్ ఇచ్చింది. వీటిలో బీఎస్ఎన్ఎల్, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయల్స్ జియో సంస్థలున్నాయి. ఈ సిమ్ కార్డులను జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

: ఈ మందువాడితే 48 గంటల్లో ఒమిక్రాన్ ఖతం.. ఆనందయ్య సంచలన ప్రకటన


ఇదిలా ఉంటే 2019 అక్టోబర్ నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ తో వారి రెండేళ్ల ప్రొబేషన్ పూర్తైంది. ఉద్యోగాలకు పర్మినెంట్ చేసేందుకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. జిల్లాల వారిగా ప్రొబేషన్ ఖరారు ప్రక్రియను కొనసాగిస్తోంది. మార్చినాటికి దీనికి సంబంధించిన ప్రక్రియంతా పూర్తి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

No comments

Powered by Blogger.