Latest

Loading...

Walking : భోజనం చేసిన తరువాత కచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే.. లేదంటే ఈ లాభాలను కోల్పోతారు..!

Walking

 Walking : రోజూ వ్యాయామం చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వ్యాయామాల్లో అత్యంత తేలికైన, సులభమైన వ్యాయామం.. వాకింగ్‌. దీన్ని ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా చేయవచ్చు.


దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేస్తే మంచిది.


2. తిన్న తరువాత వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల మేలు జరుగుతుంది. భోజనం చేశాక ఎలాగూ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక వాకింగ్ చేస్తే వెంటనే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధికంగా మెడిసిన్స్ వాడే బాధ తప్పుతుంది.


3. భోజనం చేశాక వాకింగ్ చేయడం వల్ల శరీరానికి, ముఖ్యంగా గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ లు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు. గుండె జబ్బులను నివారించవచ్చు.


4. హైబీపీ సమస్యతో బాధపడుతున్న వారు తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల బీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. భోజనం చేసిన తరువాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. దీంతో రక్త సరఫరా మెరుగు పడి బీపీ తగ్గుతుంది.


5. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు భోజనం చేశాక కొంత సేపు వాకింగ్ చేయడం మంచిది. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది.


అయితే భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేయడం వల్ల లాభాలు కలిగినప్పటికీ తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. 30 నిమిషాల విరామం అనంతరం వాకింగ్ చేయాలి. దీంతో పైన చెప్పిన లాభాలు కలుగుతాయి.

No comments

Powered by Blogger.