Weight Loss: బరువు తగ్గించే ఎనర్జీ డ్రింక్..!! ఎలా తయారు చేసుకోవాలంటే....?
Weight Loss: ఈ రోజుల్లో ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ.. పైగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కూడా మరో బోనస్.. దాంతో శారీరక శ్రమ లేకపోవడం తో క్యాలరీలు కరగక శరీరంలో కొవ్వుగా పెరిగిపోతున్నాయి..
దీని వలన స్థూలకాయంతో పాటు అధిక బరువు పెరుగుతున్నారు..!! బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? అయితే ఈ ఎనర్జీ డ్రింక్ తయారుచేసుకొని తాగితే నూరు శాతం ఫలితాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!
ఈ ఎనర్జీ తయారు చేసుకోవడానికి చిన్న బెల్లం ముక్క, ఒక స్పూన్ నిమ్మరసం అవసరం. ఒక గ్లాస్ నీటిలో బెల్లం వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఆ నీటికి ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. అంతే వేడి వేడి గా డిటాక్స్ బెల్లం లెమన్ వాటర్ తాగడానికి సిద్ధం..
ఈ పానీయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగితే జీర్ణ క్రియను పెంచుతుంది. పొట్టలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది. శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. నిమ్మలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బెల్లం లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య కు చెక్ పెడుతుంది. ఇంకా ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.
Good information, thank you
ReplyDelete