Latest

Loading...

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. రాష్ట్రంలో కరెంట్ కోతలు పూర్తిగా ఎత్తివేత...!!

ఒకవైపు మాడు పగలగొట్టే ఎండలు.. ఇంటి పట్టున ఉందామంటే కరెంట్ కోతలు. దీంతో ఏపీ ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.

ఈ ఎండాకాలం ముగిసే వరకు ఈ వెతలు తప్పవేమో అని ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఏపీ సర్కార్(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పరిశ్రమలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయబోతున్నట్లు తెలిపింది.

ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. బొగ్గు సమస్యతో ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించింది ప్రభుత్వం. వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించింది. అయితే ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలీ డే కూడా ఎత్తివేసింది.

ఇకపై అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది.

 

Andrapradesh





No comments

Powered by Blogger.