Curd Benefits : పెరుగులో వీటిని కలుపుకుని తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయట... అవేంటంటే...?
అయితే మరిన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం పెరుగులో కొన్ని పదార్థాలను కలుపుకుని తీసుకుంటే మరీ మంచిదని వైద్యులు అంటున్నారు.
పెరుగులో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం వంటి వాటితో పాటు లాక్టోస్, ఐరన్ ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచి ఫలితాలను అందిస్తాయి. పెరుగులో కొన్ని పదార్థాలను కలుపుకుని తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
పెరుగు, జీలకర్ర పొడి: పెరుగు తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు పెరుగులో (Yogurt) కొంచెం జీలకర్ర పొడిని (Cumin powder) వేసుకుని తీసుకుంటే బరువు పెరగరు. అలాగే త్వరగా బరువు కూడ తగ్గుతారు.
పెరుగు వాము: గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు పెరుగులో (Yogurt) కొద్దిగా వామును (Bishopsweed) కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. దీంతో ఉదర సంబంధిత సమస్యలు నయమవుతాయి
పెరుగు, ఓట్స్: పెరుగులో (Yogurt) ఓట్స్ (Oats) ను కలిపి తీసుకుంటే శరీరానికి ప్రోబయోటిక్స్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కండరాల దృఢత్వానికి సహాయపడతాయి. దీంతో కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పెరుగు, చక్కెర: పెరుగులో (Yogurt) చక్కెర (Sugar) కలుపుకుని తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
పెరుగు తేనె: పెరుగులో (Yogurt) తేనె (Honey) కలిపి తీసుకుంటే ఇది శరీరానికి మంచి బయోటిక్ గా పనిచేస్తుంది. దీంతో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు
పెరుగు, సోంపు: పెరుగు (Yogurt), సోంపు (Anise) ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది. అలాగే నోటి పూత సమస్యలు కూడా తగ్గుతాయి
పెరుగు, మిరియాల పొడి: తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక ఇబ్బంది పడేవారు పెరుగులో (Yogurt) కొద్దిగా మిరియాల పొడిని (Pepper powder) కలుపుకుని తీసుకోవాలి. ఇది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిస్తుంది
పెరుగు ఆరెంజ్ జ్యూస్: కీళ్ల నొప్పులతో బాధపడేవారు పెరుగులో (Yogurt) కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ (Orange juice) ను కలుపుకుని తీసుకుంటే మంచిది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గడంతోపాటు వృద్ధాప్య ఛాయలకు కూడా దూరంగా ఉండవచ్చు.
పెరుగు, పసుపు, అల్లం: పెరుగులో (Yogurt) కొంచెం పసుపు (Turmeric), అల్లం (Ginger) కలుపుకుని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
No comments