Latest

Loading...

Gas Cylinder:పేద ప్రజలకి ఇది సూపర్.. రూ. 634కే గ్యాస్‌ సిలిండర్‌...!.!

 Gas Cylinder: కరోనా కారణంగా చాలామంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తర్వాత కుటుంబ బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టంగా మారింది.

ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన పెరిగిన ధరల వల్ల సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెట్రోల్-డీజిల్, ఎల్‌పిజి సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలు ధరల పెరుగుదల కారణంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఎల్‌పిజి సిలిండర్‌పై 300 రూపాయల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ప్రస్తుతం ఎల్జీజీ సిలిండర్ ధర రూ.900 నడుస్తోంది. అయితే పేద ప్రజలు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ చౌక సిలిండర్లను తీసుకొచ్చింది. మీరు ఈ సిలిండర్‌ను కేవలం రూ. 634కి కొనుగోలు చేయవచ్చు. ఈ సిలిండర్ పేరు కాంపోజిట్ సిలిండర్. ఇది 14 కిలోల కంటే తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఈ సిలిండర్‌ను ఒంటి చేత్తో సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చు. ఇంట్లో సాధారణంగా ఉపయోగించే సిలిండర్ల కంటే ఇది 50 శాతం తేలికైనది.

కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉన్నా ఇందులో మీకు 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ సిలిండర్ ప్రత్యేకత ఏంటంటే ఇవి పారదర్శకంగా ఉంటాయి. మీరు ఈ సిలిండర్‌ను కేవలం రూ.633.5కే తీసుకెళ్లవచ్చు. మీరు ఈ సిలిండర్‌ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా రవాణా చేయవచ్చు. ఇది కాకుండా మీ కుటుంబం చిన్నది అయితే ఇది మీకు ఉత్తమ ఎంపిక. ఈ కొత్త సిలిండర్ పూర్తిగా తుప్పు నిరోధకం. ఇది కాకుండా ఈ సిలిండర్ పేలే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు గ్యాస్‌ తనిఖీ చేయడం సులభం అవుతుంది. ఎంత గ్యాస్ మిగులుతుంది, ఎంత అయిపోతుందని అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ ముగిసే అవకాశం ఉన్నందున అవసరమైన వాళ్లు త్వరగా కోనుగోలు చేస్తే బాగా ఉపయోగపడుతుంది.


1 comment:

  1. We performed at Wild Casino from totally different mobile units and tablets, and the gameplay was easy and enjoyable every time. Their web site is completely optimized for the smaller screens of smartphones. If your first deposit is made utilizing fiat money, you will be be} rewarded with a 250% deposit a lot as} $1,000. However, it must be famous that the wagering requirement is 45x for the crypto welcome 솔카지노 bonus, while for the fiat supply, it's 35x. The biggest benefit of this on-line casino is that it processes payouts actually quick.

    ReplyDelete

Powered by Blogger.